ఘనంగా అష్టలక్ష్మీ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2021-08-22T05:12:11+05:30 IST

పేరుపాలెం కనకదుర్గాబీచ్‌కు అనుకుని తీరంలో నిర్మించిన దశావతార అష్టలక్ష్మీ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు శని వారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా అష్టలక్ష్మీ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ
విగ్రహ ప్రతిష్ఠాపనలో భక్తజనం

మొగల్తూరు, ఆగస్టు 21 : పేరుపాలెం కనకదుర్గాబీచ్‌కు అనుకుని తీరంలో నిర్మించిన దశావతార అష్టలక్ష్మీ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు శని వారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సిద్ధాంతి అనిల్‌ కుమార్‌ ఆచార్యులు ఆధ్వర్యంలో విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ, మహాశాంతి హోమం, పూర్ణాహుతి, కళావాహన, గోదృష్టి, విశ్వరూప దర్శనం, శాంతి కల్యాణం చేశారు.  ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు,త్రిపురకు చెందిన కపిలేశ్వరా నందగిరి స్వామీజీ, శృంగవృక్షంనకు చెందిన సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-22T05:12:11+05:30 IST