‘రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేయాలి’

ABN , First Publish Date - 2021-01-21T04:30:59+05:30 IST

అసంపూర్తిగా వున్న రహదారి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ గిరిజన గ్రామాల ప్రజలు బుధవారం నిరసన తెలిపారు.

‘రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేయాలి’
రేగులగుంటలో నిరసన తెలుపుతున్న గిరిజన గ్రామాల ప్రజలు

గోపాలపురం, జనవరి 20: అసంపూర్తిగా వున్న రహదారి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ గిరిజన గ్రామాల ప్రజలు బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ మండలంలోని రేగులగుంట నుంచి బుట్టాయగూడెం మండలం ముద్దప్పగూడెం గ్రామం వరకు ఉన్న అంతర్గత రహదారి గత ఏడాది పనులు ప్రారంభించి మధ్యలోనే అసంపూర్తిగా వదిలి వేశారన్నారు. పాత రోడ్డును తవ్వి మెటల్‌పోసి వదిలివేయడంతో ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలు పలు ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. సుమారు 15 గ్రామా ల ప్రజలు ఆ రహదారి నుంచి పోలవరం, బుట్టాయగూడెం నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఐటీడీఏ అధికారులు రహదారి వైపు కన్నెత్తి చూడకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు రహదారి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పినిమిల్లి నాగరాజు, కూరం పీటయ్య, సొందెం రాజు, దువ్వెల బాబూరావు, చింతం దుర్గారావు, మడకం సంకురయ్య, తామా దుర్గారావు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T04:30:59+05:30 IST