ఘంటసాల శత జయంతి ఉత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-12-26T05:45:36+05:30 IST
పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు చిరస్మరణీయుడని.. పాట ఉన్నంత వరకూ జీవించి ఉంటారని ప్రముఖ గాయకుడు చిప్పాడ నాగేశ్వరరావు (భీమవరం) అన్నారు.

పాలకొల్లు అర్బన్, డిసెంబరు 25 : పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు చిరస్మరణీయుడని.. పాట ఉన్నంత వరకూ జీవించి ఉంటారని ప్రముఖ గాయకుడు చిప్పాడ నాగేశ్వరరావు (భీమవరం) అన్నారు.క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి ఘంటసాల శత జయంతి సందర్భంగా నాగేశ్వర రావు ఆధ్వర్యంలో పలువురు గాయకులు ఘంటసాల పాటలను ఆలపించారు. ఘంటసాల శత జయంతి వేడుకలను పాలకొల్లు నుంచే ప్రారంభిస్తున్నామ న్నారు.రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పట్టణాల్లో కార్యక్రమం నిర్వహిస్తామని తెలి పారు. తణుకు రాజు, నిర్మల, ఎంఎన్‌వి సాంబశివరావు పాటలు పాడారు. కార్యక్రమంలో ఈవో యాళ్ళ సూర్యనారాయణ, పాలక మండలి చైర్మన్ కోరాడ శ్రీనివాసరావు,వంగా నరసింహరావు, బీఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.