6.25 కేజీల లిక్విడ్‌ గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-12-26T05:56:04+05:30 IST

రాజమహేంద్రవరం నుంచి గుంటూరుకు తరలిస్తున్న ఐదు లక్షల విలువైన 6.25 కేజీల లిక్విడ్‌ గంజాయి ప్యాకెట్లను ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు.

6.25 కేజీల లిక్విడ్‌ గంజాయి పట్టివేత
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఈబీ ఏఎస్పీ జయరామరాజు

భీమడోలు, డిసెంబరు 25 : రాజమహేంద్రవరం నుంచి గుంటూరుకు తరలిస్తున్న ఐదు లక్షల విలువైన 6.25 కేజీల లిక్విడ్‌ గంజాయి ప్యాకెట్లను ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. భీమడోలు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఈబీ ఏఎస్పీ జయరామరాజు మాట్లాడుతూ శుక్రవారం ఉదయం గుండుగొలను హైవేపై తనిఖీ చేస్తుండగా మోటారు సైకిల్‌పై అనుమానాస్పదంగా వెళుతున్న రాజమహేంద్రవరానికి చెందిన కొలపలి శ్రీజ్యోతి భాస్కర శ్రీధర్‌ వద్ద 6.25 కేజీల లిక్విడ్‌ గంజాయి ఉన్నట్టు గుర్తించి అరెస్టు చేశామన్నారు. సందీప్‌ అనే వ్యక్తి వీటిని గుంటూరుకు తరలించాలని చెప్పడంతో అతను తీసుకు వెళుతు న్నట్టు తెలిపాడు. అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ జి.అమరబాబు, జి.అరుణకుమారి పాల్గొన్నారు.



Updated Date - 2021-12-26T05:56:04+05:30 IST