పెరిగే సంపాదనతో మనశ్శాంతి కరువు : గరికపాటి

ABN , First Publish Date - 2021-12-19T06:30:03+05:30 IST

సంపాదన పెరుగుతుంటే వ్యాధులు దరిచేరి మనశ్శాంతి కరువవడమే కాక సంసారాలు పాడవుతున్నాయని ప్రవచన కిరీటి గరికపాటి నరసింహారావు అన్నారు.

పెరిగే సంపాదనతో మనశ్శాంతి కరువు : గరికపాటి
గరికపాటికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న ఆర్యవైశ్యులు

ఆకివీడు, డిసెంబరు 18 : సంపాదన పెరుగుతుంటే వ్యాధులు దరిచేరి మనశ్శాంతి కరువవడమే కాక  సంసారాలు పాడవుతున్నాయని ప్రవచన కిరీటి గరికపాటి నరసింహారావు అన్నారు. దత్త జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం, దత్తాశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రాత్రి స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మందిరంలో ఆయన ఆధ్యాత్మిక, సాహిత్యోపన్యాసం చేశారు. దత్తాత్రేయుడు జగద్గురువన్నారు.  మనచుట్టూ ఉండే జీవరాశులు కూడా గురువులే అన్నారు.   పూర్వజన్మ ప్రభావంతోనే  కర్మలుంటాయన్నారు. జుట్టుకు రంగు వేయడం వల్ల క్యాన్సర్‌కు దారి తీస్తుందన్నారు.  ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షుడు గొంట్లా గణపతి, గుర్రం శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు పులవర్తి లక్ష్మణ్‌, చొప్పెర్ల బలరామ్‌, రైస్‌ మిల్లర్లు గొంట్లా సత్యనారాయణ, వానపల్లి బాబూరావు, గొంట్లా కృష్ణమూర్తి, లయన్స్‌ ప్రముఖులు సన్నిధి వెంకన్న, దాట్ల రామరాజు, కందుల అప్పారావు, బొబ్బిలి బంగారయ్య, యోగా గురువు కందుల సత్యనారాయణ, ఆరిఫ్‌, అజ్మల్‌, బాబు, సన్నిధి మాణిక్యాలరావు తదితరులు ఉన్నారు.

 

Updated Date - 2021-12-19T06:30:03+05:30 IST