చంద్రబాబుపై కేసు.. రాష్ట్ర అసమర్థ పాలనకు నిదర్శనం

ABN , First Publish Date - 2021-05-08T05:47:22+05:30 IST

కర్నూలు జిల్లాలో ఎన్‌–440కే వేరియంట్‌ వైరస్‌ ఉందం టూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారంటూ క్రిమినల్‌ కేసు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఓ ప్రకటనలో విమర్శించారు.

చంద్రబాబుపై కేసు.. రాష్ట్ర అసమర్థ పాలనకు నిదర్శనం

టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ‘గన్ని’ 

భీమడోలు, మే 7:కర్నూలు జిల్లాలో ఎన్‌–440కే వేరియంట్‌ వైరస్‌ ఉందం టూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారంటూ క్రిమినల్‌ కేసు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఓ ప్రకటనలో విమర్శించారు. కర్నూలులో ఎన్‌–440కే వేరియంట్‌ వైరస్‌ ఉందంటూ జాతీయ పత్రికలు, న్యూస్‌ చానళ్లు, శాస్త్రవేత్తలు సైతం ప్రకటించారన్నారు.  వైరస్‌ నియంత్రించే సూచనల్లో భాగంగా చంద్రబాబు పేర్కొన్న దానిపై సుబ్బయ్య అనే వ్యక్తి వేసిన కేసుపై స్పందిస్తూ చంద్రబాబుపై ప్రకృతి వైపరీత్యాల ప్రకారం చర్యలు తీసుకుంటామనడం జగన్‌ అసమర్థతకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు సమర్థవంతంగా పనిచేయలేక విపక్షాలపై ఇటువంటి అకారణ కేసులను మోపుతూ ప్రజల దృష్టిని మరలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కరోనా నియంత్రణ చర్యలు పక్కన పెట్టి చంద్రబాబు జపం చేస్తున్న జగన్‌ ప్రభుత్వ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, వెంటనే చంద్రబాబుపై కేసు ఉపసంహరించి కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-05-08T05:47:22+05:30 IST