గణపవరం సీఐగా వెంకటేశ్వరరావు బాధ్యతలు

ABN , First Publish Date - 2021-05-08T05:40:12+05:30 IST

గణపవరం సర్కి ల్‌ ఇన్‌స్పెక్టర్‌గా వి.వెంకటేశ్వరరావు శుక్రవారం బాధ్య తలు స్వీకరించారు.

గణపవరం సీఐగా వెంకటేశ్వరరావు బాధ్యతలు

గణపవరం/నిడమర్రు, మే  7: గణపవరం సర్కి ల్‌ ఇన్‌స్పెక్టర్‌గా వి.వెంకటేశ్వరరావు శుక్రవారం బాధ్య తలు స్వీకరించారు. ఈ స్థానంలో సీఐగా పని చేసిన డేగల భగవాన్‌ ప్రసాద్‌ మార్చి 22న షటిల్‌ ఆడుతూ హఠాన్మరణం పొందిన సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు సాధారణ రైతు కుటుంబం నుంచి 2010లో ఎస్‌ఐగా ఎంపికయ్యారు. ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావును ఆయన గౌరవపూర్వకంగా కలిశారు. సర్కిల్‌ పరిధిలో చేపట్టాల్సిన కొవిడ్‌ నియంత్రణ చర్యలను చర్చించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చేబ్రోలు ఎస్‌ఐగా పని చేశానని ఈ ప్రాంతంపై అవగాహన ఉందన్నారు. కరోనా వైరస్‌ ఉధృతి దృష్ట్యా ఈ నెల 18 వరకు పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తామన్నారు. గణపవరం ఎస్‌ఐ ఎం.వీరబాబు, చేబ్రోలు ఎస్‌ఐ వీర్రాజు తదితరులు ఆయనను అభినందించారు.  

Updated Date - 2021-05-08T05:40:12+05:30 IST