జూదరులపై బైండోవర్‌

ABN , First Publish Date - 2021-12-28T05:30:00+05:30 IST

సంక్రాంతి పండుగ నేపథ్యంలో అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ఆదేశించారు.

జూదరులపై బైండోవర్‌
అవార్డులు అందుకున్న పోలీసు అధికారులు, సిబ్బంది

జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ ఆదేశం

ఏలూరు క్రైం, డిసెంబరు 28 : సంక్రాంతి పండుగ నేపథ్యంలో అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ఆదేశించారు. ప్రతీ నెల జిల్లాస్థాయిలో నిర్వహించే నేర సమీక్ష సమావేశం మంగళ వారం ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. సమావే శంలో పాల్గొన్న ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధిం చిన ఖైనీ, గుట్కాలు అమ్మకాలు జరగకుండా చూడాలని, గంజాయి రవాణాను నిరోధించాలని ఆదేశించారు. మద్యం, ఇసుక అక్రమంగా రవాణా చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జూదం, కోడి పందేలు, గుండాట నిర్వహించే వారిపై ముందస్తుగా గుర్తించి బైండోవర్‌ కేసులు నమోదు చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే యజ మానులకు నోటీసులను అమలు చేయాలన్నారు. అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, ఎస్‌ఈబి అదనపు ఎస్పీ సి.జయరామరాజు, స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ రమేష్‌రెడ్డి, డీఎస్పీలు డాక్టర్‌ ఒ.దిలీప్‌కిరణ్‌, బి.శ్రీనాథ్‌, వీరాంజ నేయరెడ్డి, డాక్టర్‌ రవికిరణ్‌, లతాకుమారి, కేవీ సత్యనారాయణ, జీవీఎస్‌ పైడేశ్వరరావు, ఎ.శ్రీనివాసరావు, సుధాకర్‌రావు పాల్గొన్నారు.  

పోలీసులకు ప్రశంస

విధి నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేసి, కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ నగదు పురస్కారం, ప్రశంసాపత్రాలను అందించారు. ఏలూరు సబ్‌ డివిజన్‌లో డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌కిరణ్‌, ఏలూరు త్రీ టౌన్‌ సీఐ కేవీఎస్‌వీ ప్రసాద్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ డి.ఓంప్రకాష్‌, కానిస్టేబుళ్లు సీహెచ్‌ ఇసాక్‌, ఆర్‌.గొల్లరాజు, భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు, ఎస్‌ఐ వీఎస్‌వీ భద్రరావు, దెందులూరు ఎస్‌ఐ వీర్రాజు, ఏఎస్‌ఐ యు.వెంకటేశ్వరరావు, హెడ్‌కాని స్టేబుళ్లు బీవీవీఎస్‌ రమేష్‌, పి.రామచంద్రన్‌, కానిస్టేబుళ్లు ఎం.రవికుమార్‌, కె.మురళి, ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఎ.జనార్దనరావు, కొవ్వూరు సబ్‌ డివిజన్‌లో తాడేపల్లిగూడెం రూరల్‌ సీఐ రవికుమార్‌, పెంటపాడు ఎస్‌ఐ కె.చంద్ర శేఖర్‌, హెడ్‌కానిస్టేబుల్‌ పి.వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు డి.దుర్గాప్రసాద్‌, గంగాధరరావు, హోం గార్డు వెంకటేశ్వరరావు, జిల్లా స్పెషల్‌ బ్రాంచి హెడ్‌ కానిస్టేబుల్‌ ఎస్‌.పేరినాయుడుకు ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారం అందించారు. 


సకాలంలో కాపాడారు

జల్లేరు ఘటనలో పోలీసులకు ఎస్పీ అభినందన

జంగారెడ్డిగూడెం టౌన్‌, డిసెంబరు 28 : జల్లేరు వాగు బస్సు బోల్తా ప్రమాదంలో క్షతగాత్రులకు సేవలందించిన జంగారెడ్డిగూడెం పోలీసులను జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ సత్కరించారు. ఏలూరులోని ఎస్పీ కార్యా లయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈనెల 15వ తేదీన జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు బోల్తా పడి పది మంది మృత్యువాత పడగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటు అంబులెన్స్‌ ల్లోను, ఇటు పోలీసు వాహనాల్లో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి ప్రాణాలను కాపాడిన పోలీసులకు ఎస్సీ నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాలతో సత్కరించారు. సాహస ప్రతిభ, సకాలంలో స్పంది ంచకపోతే మరిన్ని ప్రాణాలు పోయేవని అన్నారు. జంగారెడ్డిగూడెం సీఐ బాలసురేష్‌బాబు, ఎస్‌ఐ సాగర్‌బాబు, హెడ్‌ కానిస్టేబుల్‌ టి.ఎర్రయ్య, జె.భీమశంకర్‌, కానిస్టేబుల్‌  ఆర్‌.ప్రకాశరెడ్డి, కేఎస్‌ఆర్‌కే రాజబాబు, సీహెచ్‌ సత్యనారాయణ పురస్కారాలను అందుకున్నారు.


Updated Date - 2021-12-28T05:30:00+05:30 IST