వనభోజనాల ముసుగులో పేకాట

ABN , First Publish Date - 2021-11-10T05:05:35+05:30 IST

చివటం గ్రామంలో కార్తీక వన సమారాధన సందర్భంగా పేకాట ఆడుతున్న 31మందిని అరెస్టు చేసినట్లు కొవ్వూరు డీఎస్పీ కె.శ్రీనాథ్‌ తెలిపారు.

వనభోజనాల ముసుగులో పేకాట

31 మంది అరెస్టు...  కారు, 20 మోటార్‌ సైకిళ్ళు,
30 సెల్‌ఫోన్లు, రూ.3,51,600 నగదు స్వాధీనం

ఉండ్రాజవరం, నవంబరు 9: చివటం గ్రామంలో కార్తీక వన సమారాధన సందర్భంగా పేకాట ఆడుతున్న 31మందిని అరెస్టు చేసినట్లు కొవ్వూరు డీఎస్పీ కె.శ్రీనాథ్‌ తెలిపారు. వీరి నుంచి ఒక కారు, 20 మోటార్‌ సైకిళ్లు, 30 సెల్‌ఫోన్లు, రూ. 3,51,600 నగదును సీజ్‌ చేశామన్నారు. నల్ల భాస్కరరావు అనే వ్యక్తి కార్తీక వనసమారాధన ముసుగులో పేకాట స్థావరం ఏర్పాటు చేయగా తాము దాడి చేసినట్టు తెలిపారు. నల్ల భాస్కరరావుతోపాటు వేల్పూరుకు చెందిన చాణక్యలు పరారైనట్లు ఆయన చెప్పారు. విలేకరుల సమావేశంలో తణుకు సీఐ కృష్ణచైతన్య, ఎస్సై కె. రామారావు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-10T05:05:35+05:30 IST