స్వాతంత్య్ర సమరయోధుడికి సత్కారం

ABN , First Publish Date - 2021-08-11T04:27:18+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించుకోవడం మనకు దక్కిన అదృష్టమని వసుధ ఫౌండేషన్‌ కార్యదర్శి మంతెన కృష్ణంరాజు అన్నారు.

స్వాతంత్య్ర సమరయోధుడికి సత్కారం
సోమరాజును సత్కరిస్తున్న సర్వోదయ మండలి సభ్యులు

భీమవరం అర్బన్‌, ఆగస్టు 10 : స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించుకోవడం మనకు దక్కిన అదృష్టమని వసుధ ఫౌండేషన్‌ కార్యదర్శి మంతెన కృష్ణంరాజు అన్నారు. స్వరాజ్‌ 75 ఉత్సవాల్లో భాగం గా స్వాతంత్య్ర సమరయోధుడు కలిదిండి వెంకట సోమరాజును మంగళవారం శ్రీరాంపురంలోని గాంధి కస్తూరీభా భవనంలో సర్వోదయ మండలి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.  భీమ వరం తహసీల్దారు కార్యాలయం వద్ద  సోమరాజు 1942 ఆగస్టు 17వ తేదీన బ్రిటిష్‌ పాలకుల లాఠీ దెబ్బలు తిన్నారన్నారు. మూడు మాసాలు పాటు జైలు జీవితం గడిపారన్నారు. గాంధీ కస్తూరీభా భవనాన్ని వసుధ ఫౌండేషన్‌ చైర్మన్‌ మంతెన వెంకట రామరాజు సహకారంతో నిర్మి స్తామన్నారు.కార్యక్రమంలో ఇందుకూరి ప్రసాదరాజు,మురళీకృష్ణ పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-11T04:27:18+05:30 IST