బౌద్ధ ధమ్మ పీఠంలో ఉచిత కంటి పరీక్షలు
ABN , First Publish Date - 2021-11-16T06:12:57+05:30 IST
ఉండ్రాజవరంలోని బౌద్ధ ధమ్మ పీఠంలో పీఠాధిపతి అనాలయో ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం సోమవారం నిర్వహించారు.
ఉండ్రాజవరం, నవంబరు 15: ఉండ్రాజవరంలోని బౌద్ధ ధమ్మ పీఠంలో పీఠాధిపతి అనాలయో ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం సోమవారం నిర్వహించారు. సుమారు 129 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, మందు లను ఉచితంగా అందజేశారు. వేమగిరికి చెందిన పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. 16 మందికి కాటరాక్టు ఆపరేషన్లు అవసరమని గుర్తించామని, వారికి పీఠం ఆధ్వర్యంలో ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తామని అనాలయో చెప్పారు. వైద్య శిబిరానికి సహకరించిన వారికి పీఠాధిపతి కృతజ్ఞతలు తెలిపారు.