టీచర్‌ సహా నలుగురికి కొవిడ్‌ పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-12-19T06:08:04+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల నమోదు క్రమేణా పెరుగుతున్నాయి.

టీచర్‌ సహా నలుగురికి కొవిడ్‌ పాజిటివ్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 18 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల నమోదు క్రమేణా పెరుగుతున్నాయి. శుక్ర, శనివారాల్లో వెల్లడైన ల్యాబ్‌ నివేదికల ప్రకారం దెందులూరు మండలం దోసపాడు పాఠశాలలో ఒక విద్యార్థికి, అత్తిలి మండలం బల్లిపాడు ప్రాథమిక పాఠశాల నెంబర్‌–1లో ఇద్దరు విద్యార్థులకు, పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు పాఠశాలలో ఒక టీచర్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిందని విద్యాశాఖ వర్గాలు వివరించాయి.

Updated Date - 2021-12-19T06:08:04+05:30 IST