షార్ట్‌ సర్క్యూట్‌తో నాలుగిళ్లు దగ్ధం

ABN , First Publish Date - 2021-05-09T04:36:34+05:30 IST

మండలం పోతవరంలో విద్యుత్‌ ష్టార్ట్‌ సర్క్యూట్‌తో నాలుగిళ్లు దగ్ధమయ్యాయి.

షార్ట్‌ సర్క్యూట్‌తో నాలుగిళ్లు దగ్ధం
కాలిపోయిన ఇళ్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే తలారి వెంకట్రావు

నల్లజర్ల, ఏప్రిల్‌ 8 : మండలం పోతవరంలో విద్యుత్‌ ష్టార్ట్‌ సర్క్యూట్‌తో నాలుగిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన గంధిపాము రమణయ్య ఇం ట్లో శనివారం ఉదయం షార్ట్‌ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు ఏర్ప డ్డాయి. వంట గదిలో గ్యాస్‌ సిలెండర్‌ పేలి పక్కనే ఉన్న ఉప్పాటి వెంకటేశ్వరమ్మ, అట్లూరి వీరస్వామి, పల్లేటి చిన్న ఇళ్లపై మంటలు వ్యాపించాయి. రమణయ్య ఇంటితోపాటు మరో మూడు ఇళ్లు కాలిపోయాయి. బంగారం, వంట సామగ్రి, దుస్తులు కాలిపోయాయి. స్థానికులు మంటలు ఆదుపు చేశారు. బాధితులు ఉపాధి హామీ పనులతో జీవనం సాగిస్తున్నారు. సుమా రు రూ.6.6 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు వాపోతున్నారు. బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పరామర్శించారు. రూ.2500 నగదు, నిత్యావసర వస్తువులు అందించారు.

Updated Date - 2021-05-09T04:36:34+05:30 IST