నల్ల చట్టాలు రద్దు .. పార్లమెంట్‌లో ఆమోదించాలి

ABN , First Publish Date - 2021-11-27T05:20:33+05:30 IST

రైతు వ్యతిరేక నల్ల చట్లాల రద్దు పార్లమెంట్‌లో ఆమోదించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చిర్లా పుల్లారెడ్డి, నరసాపురం పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌చౌదరి తెలిపారు.

నల్ల చట్టాలు రద్దు .. పార్లమెంట్‌లో ఆమోదించాలి
పెంటపాడు రిలే దీక్షలో నినాదాలు చేస్తున్న నాయకులు

తణుకు, పెంటపాడు, కైకరంలో రిలే నిరాహార దీక్షలు 

పెంటపాడు, నవంబరు 26:రైతు వ్యతిరేక నల్ల చట్లాల రద్దు పార్లమెంట్‌లో ఆమోదించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చిర్లా పుల్లారెడ్డి, నరసాపురం పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌చౌదరి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం ప్రారంభించి శుక్రవారం నాటికి ఏడాది పూర్తి కావడంతో ఉద్యమకారులకు మద్దతుగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెంటపాడు గేటు సెంటర్‌ వద్ద రిలే నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. ఉద్యమ సమయంలో ప్రాణాలర్పించిన 750 రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతు  నాయకులు బంకూరు నాగేశ్వరరావు, తేతలి నాగిరెడ్డి, యాండ్రపు కృష్ణ, అడపా ఆంజనేయులు, పెనగంటి దుర్గారావు, జక్కంపూడి వెంకట్రావు, రంగారావు పాల్గొన్నారు.

చట్టాల రద్దుకు చట్టబద్ధత కల్పించాలి

తణుకు, నవంబరు 26:రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దుకు చట్ట బద్ధత కల్పించాలని, రైతు పండించే పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టాన్ని ఆమోదించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కోనాల భీమారావు, సీపీఎం పట్టణ కార్యదర్శి పీవీ ప్రతాప్‌ డిమాండ్‌ చేశారు. వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు కోరుతూ ఢిల్లీలో చేపట్టిన ఉద్యమం శుక్రవారానికి ఏడాది పూర్తయిన సందర్భంగా కోర్టు సెంటర్‌లో సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో సామాజికవేత్త సంకు మనోరమ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు బళ్ళ చిన వీరభద్రం, పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, ఏరియా కార్యదర్శి పుష్పకుమారి, నామన వెంకటేశ్వరావు, అమ్మిరాజు, వెంకటరెడ్డి, మురళీ, సత్యనారాయణ, గార రంగారావు, తదితరులు పాల్గొన్నారు.

 కైకరంలో నిరసన..

ఉంగుటూరు, నవంబరు 26:కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, విద్యుత్‌ సవరణ చట్టం రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం కైకరంలో రైతులు, కౌలు రైతులు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ వెంకట కృష్ణారావు, కౌలు రైతు సంఘం జిల్లా కో–కన్వీనర్‌ కొర్ని అప్పారావు, రైతులు పాల్గొన్నారు.Updated Date - 2021-11-27T05:20:33+05:30 IST