ముంచుకొస్తున్న గోదారి

ABN , First Publish Date - 2021-07-25T05:25:09+05:30 IST

కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం కారణంగా గోదావరిలో వరద అంతకంతకూ పెరగడమే కాకుండా పరివాహక గ్రామాలను ముంచెత్తు తోంది.

ముంచుకొస్తున్న గోదారి
పోలవరం మండలం వాడపల్లిలో ఇళ్లల్లోకి చేరిన నీరు

బిక్కు బిక్కుమంటున్న నిర్వాసిత కుటుంబాలు

కుక్కునూరు, వేలేరుపాడుల్లో రాకపోకలు బంద్‌

పడవలపై సామాన్లతో కొండలపైకి  

పోలవరం నుంచి 19 గ్రామాలకు దారిలేదు

స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌ వద్ద భారీగా వరద నీరు 


గోదావరి వరద ముంచుకొస్తోంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను దాటి వేగంగా వరద దిగువకు దూసుకొస్తున్నది. ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరంలో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పరివాహక గ్రామాలన్నింటిలోనూ వరద నీరు చేరింది. ఇంట్లో సామాన్లు పడవల మీదకు చేర్చి సమీపాన ఉన్న కొండ ప్రాంతాల్లో తల దాచుకునేందుకు నిర్వాసితులు ప్రయత్నిస్తున్నారు. అధికారులు సహాయ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. 

 – (ఏలూరు– ఆంధ్రజ్యోతి)


కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం కారణంగా గోదావరిలో వరద అంతకంతకూ పెరగడమే కాకుండా పరివాహక గ్రామాలను ముంచెత్తు తోంది. పోలవరంలో గోదావరి నీటిమట్టం 23.52 మీటర్లకు చేరుకోవడంతో కడెమ్మ స్లూయిజ్‌ గేట్లు పూర్తిగా మునిగిపోయాయి. దీంతో ఏటిగట్టుకు కుడి వైపున ఉన్న కొండవాగుల నీరు దిగువకు వెళ్లే మార్గంలేక నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. పోలవరం మండలంలోని దాదాపు మూడు గ్రామాల్లో ఇప్పటికే నీరు చేరింది. దాదాపు 8 ఎడుగుల మేర వరద నీరు కోండ్రుకోట, కొత్తూరు, వాడపల్లి గ్రామాలను చుట్టు ముట్టింది. ఇంట్లో ఉన్న సామాగ్రి పడవల్లో చేర్చి మరి శనివారం కొండలపైకి చేరిపో యారు.అధికారులు ఆయా గ్రామాల్లో ముందస్తుగా జనరేటర్లను ఏర్పాటు చేశారు. జనరేటర్లకు అవస రమైన డీజిల్‌తో పాటు ప్రజలకు ఆహార ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా వంట గ్యాస్‌ బండలను ఆయా గ్రామాలకు చేర్చేందుకు శనివారం శ్రీకారం చుట్టారు. పడవల ద్వారా కాఫర్‌ డ్యామ్‌ నుంచి ఎగువ గ్రామానికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో కుక్కునూరు, వేలేరు పాడు వాసులు భయం గుప్పెట్లో చిక్కు కు న్నారు. శనివారం సాయంత్రం నాటికే గోదావరి 48 అడుగుల వరకూ చేరడంతో తెల్లవారే సరికల్లా భారీస్థాయిలో వరద దిగువకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నా రు. తగ్గట్టుగానే సమీప ప్రాంతాల్లో ఉన్న పాఠశాల ల్లో సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. వీలైనం త మందిని శిబిరాలకు చేర్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం నాటికి వరద ఉధృతి మరింత పెరిగితే వేలేరుపాడును ముంచెత్తవచ్చు. పోలవరం గ్రామానికి రక్షణ గా ఉన్న నక్లెస్‌ రోడ్డు ఈ వరద తాకిడికి తట్టుకోగలదా అన్న అనుమా నం లేదు. ఇప్పటికే పలుమార్లు ఈ ప్రాంతాన్ని అధికారులు తనిఖీలు చేశారు. ఎటువంటి వరద ముప్పు  ఉండబోదనే ధీమాకు వచ్చారు. గోదావరి వరద ఉధృతికి తోడు ఉపనది అయిన శబరి నుంచి భారీ వరద వస్తే ముంపు మండలాలతో పాటు ఇతర ప్రాంతాలు కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉండేది. అయితే ఈసారి శబరిలో వరద పెద్దగా పెరగకపోవ డంతో వేలేరుపాడు, కుక్కు నూరు వాసులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద అఖండ గోదావరి క్రమ క్రమంగా పెరుగుతోంది. దీంతో గోష్పాదం మెట్లు కూడా వరద నీటిలో మునిగాయి. బ్యారేజ్‌కు ఉన్న ధవళేశ్వరం, ర్యాలీ, విజ్జేశ్వరం, మద్దూరు ఆరమ్‌లలోని 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 4,61,337 క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి విడుదల చేశారు.ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద 11.75 అడుగులు లేక 10 లక్షల వరద ప్రవాహం వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.


భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక


పోలవరం, జూలై 24 : మునుపెన్నడూ లేనివిధంగా గోదా వరి నీటిమట్టం అనూహ్యరీతిలో పెరుగుతోంది. భద్రాచలం వద్ద శనివారం ఉదయం నీటిమట్టం 43 అడుగులు నమోదు కాగా అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. రాత్రి పది గంటల సమ యానికి 48.7 అడుగుల కు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పోలవరం ప్రాజె క్టు ఎగువ కాఫర్‌డ్యాం 33.410 మీటర్లు, స్పిల్‌వే వద్ద 32.490 మీటర్లు నీటి మట్టం నమోదైంది. పోల వరం ప్రాజెక్టు ఎగువన అదనంగా వస్తున్న 6 లక్షల 62వేల 825 క్యూసెక్కుల వరద జలాలను స్పిల్‌వే నుంచి విడుదల చేయగా మరో 5,48,542 క్యూసెక్కుల వరద జలాలను సాయంత్రానికి విడుదల చేశారు. రానున్న 12 గంటల్లో అదనంగా 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద జలాలు రావచ్చని జలవనరుల శాఖాధి కారులు చెబుతున్నారు. కాఫర్‌డ్యాం బ్యాక్‌వాటర్‌ ప్రభావంతో పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన కొండ్రుకోట, మాధపురం, కొత్తూరు, వాడపల్లి, గ్రామాలు నీటమునిగాయి. జంగారెడ్డిగూడెం ఆర్‌డీవో ప్రసన్నలక్ష్మి, తహసీల్దార్‌ సుమతి, పోల వరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌డ్యాం నుంచి నిర్వాసితులను  సురక్షిత ప్రాంతాలకు బోట్లుపై తరలించేందుకు ర్యాంపులు పరిశీలించారు. Updated Date - 2021-07-25T05:25:09+05:30 IST