హక్కుల సాధనకు ఆదివాసీలు ఉద్యమించాలి

ABN , First Publish Date - 2021-11-03T04:46:09+05:30 IST

పోరాడి సాధించుకున్న హక్కులను హరిస్తున్న ప్రభుత్వాల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీలు ఉద్యమించాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడె మోక్రసీ నాయకులు పి.శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.

హక్కుల సాధనకు ఆదివాసీలు ఉద్యమించాలి
స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న గిరిజనులు

బుట్టాయగూడెం, నవంబరు 2: పోరాడి సాధించుకున్న హక్కులను హరిస్తున్న ప్రభుత్వాల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీలు ఉద్యమించాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడె మోక్రసీ నాయకులు పి.శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రాజానగరం, నాగన్నగూడెం గ్రామాల్లోని అమరుల స్థూపాల వద్ద నాయకులు, ఆదివాసీ లు నివాళులర్పించారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆదివాసీలను అడవుల నుం చి తరిమివేసి అడవులను, అటవీ సంపదను దోపిడీదారులకు అప్పగిస్తున్నా రని ఆరోపించారు. అడ్డువచ్చినవారిని అంతమొందించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను అంబానీ, అదానీలకు మోదీ అప్పగిస్తున్నా డని ఆవేదన వ్యక్తం చేశారు. పీవోడబ్ల్యు నాయకురాలు పి.లత, మాండ్రు పండు, కోండ్ల శ్రీరామ్మూర్తిరెడ్డి, పట్ల బాబుల్‌రెడ్డి ఆదివాసీలు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-03T04:46:09+05:30 IST