జ్వరాలపై సర్వే

ABN , First Publish Date - 2021-08-28T04:41:39+05:30 IST

పలు గ్రామాలలో ప్రజలు వైరల్‌ జ్వరా లతో వణికిపోతున్నారు.

జ్వరాలపై సర్వే

ఇరగవరం, ఆగస్టు 27: పలు గ్రామాలలో ప్రజలు వైరల్‌ జ్వరా లతో వణికిపోతున్నారు. ఒకపక్క కొవిడ్‌ కేసులు, మరోపక్క వైరల్‌ జ్వరాలతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.  ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సాధారణ జ్వరం వచ్చినా కొవిడ్‌ లేక జ్వరమో, డెంగీ జ్వరమో తెలియక భయాందోళనకు గురవుతున్నారు. జ్వరంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే కొవిడ్‌ పరీక్ష చేస్తారనే భయంతో చాలామంది అమాయక ప్రజలు ప్రైవేటు ఆర్‌ఎంపి వైద్యులతో పరీక్షలు చేయించుకుని వృథా ప్రయా సలకు లోనవుతున్నారు.  వైరల్‌ జ్వరాలపై ఇరగవరం పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్‌ వి.లక్ష్మి మాట్లాడుతూ వాతావరణ మార్పులతో వైరల్‌ జ్వరాలు సోకుతు న్నాయన్నారు. వైరల్‌ జ్వరాల బారిన పడిన ప్రజలు  ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకోవాలన్నారు. ఇప్పటికే వైరల్‌ జ్వరాలపై గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటా సర్వే చేపట్టినట్టు ఆమె తెలిపారు.


Updated Date - 2021-08-28T04:41:39+05:30 IST