కోటసత్తెమ్మ తిరునాళ్ల ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-19T06:03:12+05:30 IST

తిమ్మరాజుపాలెంలో కోటసత్తెమ్మ తిరునాళ్ల ఉత్స వాలను వంశ పారంపర్య ధర్మకర్త, చైర్మన్‌ దేవులపల్లి రామసుబ్బరాయశాస్ర్తి, లలిత దంపతులచే ప్రారంభించారు.

కోటసత్తెమ్మ తిరునాళ్ల ప్రారంభం
ఆలయంలో కలశస్థాపన దృశ్యం

నిడదవోలు, డిసెంబరు 18: తిమ్మరాజుపాలెంలో కోటసత్తెమ్మ తిరునాళ్ల ఉత్స వాలను వంశ పారంపర్య ధర్మకర్త, చైర్మన్‌ దేవులపల్లి రామసుబ్బరాయశాస్ర్తి, లలిత దంపతులచే ప్రారంభించారు. అనంతరం  చుట్టు పక్కల దేవాలయాలైన నిడద వోలు గ్రామ దేవత నాంగల్యదేవి, శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాల నుంచి నిర్వాహకులు కోటసత్తెమ్మ అమ్మవారికి సాంప్రదాయబద్దంగా సారెను తీసుకు వచ్చి సమర్పించారు. మొదటిరోజు అమ్మవారికి లక్ష కుంకుమార్చన ఉదయం చండీ పారాయణ, సాయంత్రం హోమం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మ వారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ల నీలకంఠం (శివ), ధర్మకర్తల మండలి సభ్యులు అయి నీడి వెంకటకృష్ణ, యాళ్ళ రాఘవులు, గాజుల రంగారావు పాల్గొన్నారు.




Updated Date - 2021-12-19T06:03:12+05:30 IST