ఎరువుల అక్రమ నిల్వలు స్వాధీనం

ABN , First Publish Date - 2021-08-28T04:57:50+05:30 IST

అనుమతి లేకుండా నిల్వ ఉంచిన ఎరువులను స్వాధీనం చేసుకున్నట్లు ఏవో డి.ముత్యాలరావు శుక్రవారం తెలిపారు.

ఎరువుల అక్రమ నిల్వలు స్వాధీనం
ఏపికుంటలో నిల్వ ఉంచిన ఎరువులు

టి.నరసాపురం, ఆగస్టు 27: అనుమతి లేకుండా నిల్వ ఉంచిన ఎరువులను స్వాధీనం చేసుకున్నట్లు ఏవో డి.ముత్యాలరావు శుక్రవారం తెలిపారు. ఏపికుంట గ్రామంలో అక్రమంగా ఎరు వులు నిల్వ ఉంచారని రైతు లు సమాచారం ఇచ్చారు. కోట శివాజీ వ్యవసాయ భూమిలో తనీఖీ చేయగా రూ.60వేలు విలువచేసే 180 ఎరువుల బస్తాలు అక్రమంగా నిల్వ ఉంచినట్టు గుర్తించామని తెలిపారు. ఎరువుల నమూనాలను గుంటూరు వ్యవసాయ కోడింగ్‌ ఆఫీస్‌కు పంపామని నమూనా సేకరణ ఆధారంగా ఉన్నతాదికారుల ఆదేశాలతో భాద్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Updated Date - 2021-08-28T04:57:50+05:30 IST