ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల వినతి

ABN , First Publish Date - 2021-05-21T04:36:58+05:30 IST

ధాన్యం కొనుగోలు తమను ఆదుకోవాలని పలువురు రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల వినతి
డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న రైతులు

పోలవరం, మే 20: ధాన్యం కొనుగోలు తమను ఆదుకోవాలని పలువురు రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. గూటాల రైతులు డిప్యూటీ తహసీ ల్దార్‌ ప్రసాద్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు. గూటాల పరిధిలో 40 వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉందన్నారు. కార్యక్రమంలో గూటాల సొసైటీ అధ్యక్షుడు సుంకర అంజిబాబు, నాయకులు సుంకర వెంకట రెడ్డి, తోట వెంకన్నదొర, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-21T04:36:58+05:30 IST