ఏలూరులో మరో 30 ఆక్సిజన్‌ పడకలు

ABN , First Publish Date - 2021-05-21T05:15:55+05:30 IST

ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మరో 30 ఆక్సిజన్‌ పడకల ఏర్పాటుకు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.

ఏలూరులో మరో 30 ఆక్సిజన్‌ పడకలు
ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చిన జర్మన్‌ షెపార్డ్‌ నిర్మాణ సామగ్రి

ఏలూరు క్రైం, మే 20 : ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మరో 30 ఆక్సిజన్‌ పడకల ఏర్పాటుకు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.   కరోనా బాధితులు రోజురోజుకు పెరుగుతుండడంతో ఉన్న ఆక్సిజన్‌ పడకలు చాలడం లేదని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆకస్మిక తనిఖీలో తెలుసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ఐ అధికారులు రంగంలోకి దిగి జర్మన్‌ షెపార్డ్‌ పడకల నిర్మాణం చేపట్టడానికి చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆసుపత్రి ఆవరణలోని పాత భవనాన్ని తొలగించిన ప్రాంతంలో జర్మన్‌ షెపార్డ్‌ తాత్కాలిక టెంట్లను ఏర్పాటు చేయడానికి సామగ్రి గురువారం మధ్యాహ్నానికి లారీల్లో చేరుకుంది. 30 ఆక్సిజన్‌ పడకలను యుద్ధ ప్రాతిపదికన రెండు రోజుల్లో ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణ పనులను శుక్రవారం ఉదయం చేపట్టనున్నారు. 

Updated Date - 2021-05-21T05:15:55+05:30 IST