జగన్‌ అసమర్ధ పాలనతో సంక్షోభం

ABN , First Publish Date - 2021-10-26T05:03:52+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అసమర్థ పాలన వలన రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ ఎమ్మెల్యే ముప్పి డి వెంకటేశ్వరరావు విమర్శించారు.

జగన్‌ అసమర్ధ పాలనతో సంక్షోభం
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముప్పిడి వెంకటేశ్వరరావు

దేవరపల్లి, అక్టోబరు 25: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అసమర్థ పాలన వలన రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ ఎమ్మెల్యే ముప్పి డి వెంకటేశ్వరరావు విమర్శించారు. దేవరపల్లిలో ఆయన సోమవారం విలేక రుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పుల ఊబి లోకి నెట్టేసి ప్రజలపై పెనుభారం మోపుతుందన్నారు. 1983 నుంచి ఇప్పటి వరకు పేదలకు హౌసింగ్‌ కార్పొరేషన్ల ద్వారా పేదల ఇళ్లకు సబ్సిడీపై రుణా లు ఇచ్చారని, అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ ముఖ్యమంత్రి రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాల అమలు కోసం రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉండడంతో అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేసి పేదలు గృహ రుణాలు చెల్లించాలని డిమాండ్‌ చేయడం సరికాదన్నారు ఈ ప్రయత్నాన్ని విరమించ కపోతే లబ్ధిదారులతో పాటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళన చేపట్టడం జరుగుతుందన్నారు. నాడు ఇందిరాగాంధీ వెదురుబొంగులు, తాటాకులు ఇచ్చారన్నారు. ఎన్‌టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపప్పుడు కూడు, గూడు, గుడ్డ మౌలిక సదుపాయాలు కల్పించడంతో, కిలో రూ.2 బియ్యం, జనతా వస్ర్తాలు, పెంకిటిళ్లు కట్టించారన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పట్టించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. ఆర్థిక పరిస్థితి దిగజారడంతో ప్రభుత్వ భూములు అమ్మివేయడం, వివిధ పన్నుల పెంపుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ప్రభుత్వం ఇసుక, మద్యం ద్వారా ప్రజలను దోచుకుంటుందని, ప్రజలకు పావలా ఖర్చుపెట్టి ముప్పా వలా వసూలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు. టీడీపీ నాయకులు సుంకర దుర్గారావు, కే.రవికుమార్‌, బొల్లిన శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T05:03:52+05:30 IST