జాబ్‌ క్యాలెండర్‌ కాదు.. డూప్‌ క్యాలెండర్‌

ABN , First Publish Date - 2021-06-23T05:02:47+05:30 IST

ముఖ్యమంత్రి రూపొందించిన జాబ్‌ క్యాలెండర్‌ డూపు క్యాలెండర్‌లా ఉందని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విమర్శించారు.

జాబ్‌ క్యాలెండర్‌ కాదు.. డూప్‌ క్యాలెండర్‌

దేవరపల్లి, జూన్‌ 22: ముఖ్యమంత్రి రూపొందించిన జాబ్‌ క్యాలెండర్‌ డూపు క్యాలెండర్‌లా ఉందని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విమర్శించారు. దేవరపల్లిలో ముప్పిడి క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. రెండేళ్లు గడిచినా డీఎస్సీ, గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 ఉద్యో గాల నోటిఫికేషన్‌ జాడే లేదన్నారు. పోలీస్‌ శాఖలో నియమకాలు చేపట్టిన దాఖలాలు లేవని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వం అభివృద్ధిని చేయాల్సింది పోయి ఉన్న కంపెనీలనే వెళ్లగొడుతుందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే  ప్రకటించిన విధంగా జాబు క్యాలెండర్‌ అమలుచేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-06-23T05:02:47+05:30 IST