ఉండి మాజీ ఎమ్మెల్యే దండుబోయిన పేరయ్య మృతి

ABN , First Publish Date - 2021-08-26T05:26:26+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ నేత, ఉండి నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే దండుబోయిన పేరయ్య (86) హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యా హ్నం మృతి చెందారు.

ఉండి మాజీ ఎమ్మెల్యే దండుబోయిన పేరయ్య మృతి
పేరయ్య (ఫైల్‌)

స్వగ్రామం కలిసిపూడిలో విషాదఛాయలు

ఉండి, ఆగస్టు 25 : కాంగ్రెస్‌ పార్టీ నేత, ఉండి నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే దండుబోయిన పేరయ్య (86) హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యా హ్నం మృతి చెందారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమా రులు. బీసీ సామాజిక వర్గానికి చెంది న ఈయన 1972–78లో రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఉండి నియోజకవర్గంలో పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. నియోజక వర్గంలో మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ కోసం ఎనలేని సేవలందించారని ఆయన గురించి స్థానిక నాయ కులు చెబుతుంటారు. రాజశేఖర్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఉండి విచ్చేసినపుడు ప్రచారం రఽథం వద్దకు  పేరయ్యను ఆహ్వా నించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారని పార్టీ నాయకులు చెబు తుంటారు.కొన్నేళ్లుగా ఆయన హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఆయన మృతితో స్వగ్రామం కలిసిపూడిలో విషాదఛాయలు నెల కొన్నాయి. కుటుంబ సభ్యులంతా హైదారాబాద్‌లోనే ఉన్నారు.  


Updated Date - 2021-08-26T05:26:26+05:30 IST