పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-11-22T05:27:05+05:30 IST

ఇటీవల కురిసిన వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు.

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
కంతేరులో పంట పరిశీలిస్తున్న ఆరిమిల్లి రాధాకృష్ణ,

ఇరగవరం, నవంబరు 21 : ఇటీవల కురిసిన వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు. మండలంలో కంతేరు, పొదలాడ, కె.ఇల్లిందల పర్రు తదితర గ్రామాల్లో నీటమునిగిన పంటలను ఆదివారం ఆయన పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో దాదాపుగా రెండు వేల ఎకరాల స్వర్ణసాగు పూర్తిగా నష్టపోయిందన్నారు. రైతులు సుమారు ఎకరానికి రూ. 25 వేలు వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయారన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే విధానంలో మార్పులు చేసి న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇరగవరం మండల పార్టీ ప్రెసిడెంట్‌ గోపిశెట్టి రామకృష్ణ, రెడ్డి రాంప్రసాద్‌, బొంతు శ్రీను, మానే భాస్కరరావు, కునుకు సత్తిబాబు, కామన ఏడుకొండ లు, నున్న మోహనరావు, సత్యసోమశేఖర్‌ రెడ్డి, ద్వారంపూడి చిన వెంకటరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విధానం వల్లే రైతులకు నష్టం : బాబ్జి

తాడేపల్లిగూడెం రూరల్‌, నవంబరు 21: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు లో కొత్త విధానాలు ప్రవేశపెట్టడం వల్లే రైతులు నష్టపోయారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి తెలిపారు. లింగారాయుడుగూడెం, దం డగర్ర, ఉప్పరగూడెం గ్రామాల్లో ధాన్యాన్ని ఆదివారం ఆయన పరిశీ లించారు. గత టీడీపీ హయాంలో మాదిరిగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలుగు రైతు నరసాపురం జిల్లా అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌ చౌదరి, మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్‌, సర్పంచ్‌ పిల్లా రాంబాబు, నాయకులు వాడపల్లి వెంకటసుబ్బరాజు,  పి.గంగరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-22T05:27:05+05:30 IST