రాష్ట్రంలో పెరిగిన అరాచకత్వం

ABN , First Publish Date - 2021-08-11T05:10:36+05:30 IST

‘రాష్ట్రంలో అరాచకత్వం పెరిగింది. అవినీతిని ప్రశ్నించే వారి గొంతు నొక్కడమే ధ్యేయంగా వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారు.

రాష్ట్రంలో పెరిగిన అరాచకత్వం
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నివాసంలో మాజీ మంత్రి పరిటాల సునీత

మాజీ మంత్రి పరిటాల సునీత

పెదవేగి, ఆగస్టు 10 : ‘రాష్ట్రంలో అరాచకత్వం పెరిగింది. అవినీతిని ప్రశ్నించే వారి గొంతు నొక్కడమే ధ్యేయంగా వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. గనులను కొల్లగొడుతూ, ప్రతిపక్షాలను విమర్శిస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. ఒకటో తేదీ వచ్చిందంటే ఉద్యోగుల జీతాల కోసం వెంపర్లాడే దుస్థితి నెలకొంది’ అని మాజీ మంత్రి, తెలుగుదేశం నేత పరిటాల సునీత ఆందోళన వ్యక్తం చేశారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పెదవేగి మండలం దుగ్గిరాలలోని ఆయన స్వగృహంలో మంగళవారం కలిసి, క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభాకర్‌ చేస్తున్న ప్రజోపయోగ కార్యక్రమాలకు అడ్డుతగలడం అధికార పార్టీ నాయ కుల  నీచబుద్ధికి తార్కాణమని విమర్శించారు. వారు చేయరు. చేసే వారిని చేయనివ్వరు.. అంటూ దుయ్యబట్టారు. నిత్యం ప్రజలతో మమేకమై ఉండే ప్రభాకర్‌కు అన్ని విధాల అండగా ఉంటామని సునీత భరోసా ఇచ్చారు.


Updated Date - 2021-08-11T05:10:36+05:30 IST