వైసీపీ నాయకుల దూకుడు దురదృష్టకరం
ABN , First Publish Date - 2021-01-21T05:08:23+05:30 IST
టిడ్కో ఇళ్ల పంపిణీ సభలో ఎమ్మెల్సీ అంగరపై వైసీపీ నేతల దూకుడు దురదృష్టకరమని, తెలు గుదేశం పాలనలో తామూ ఇలానే ప్రవ ర్తించి ఉంటే జగన్ పాదయాత్ర జరిగేదా అంటూ మాజీ మంత్రి పీతల సుజాత ప్రశ్నించారు.

మాజీ మంత్రి పీతల సుజాత
పాలకొల్లు టౌన్, జనవరి 20: టిడ్కో ఇళ్ల పంపిణీ సభలో ఎమ్మెల్సీ అంగరపై వైసీపీ నేతల దూకుడు దురదృష్టకరమని, తెలు గుదేశం పాలనలో తామూ ఇలానే ప్రవ ర్తించి ఉంటే జగన్ పాదయాత్ర జరిగేదా అంటూ మాజీ మంత్రి పీతల సుజాత ప్రశ్నించారు. బుధవారం పాలకొల్లులో విలేకర్ల సమావేశంలో సుజాత మాట్లాడారు. అంగరను ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు సభలో నెట్టివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైపీపీ నాయకులకు అసలు ప్రొటోకాల్ అంటే తెలియదా అని విస్మయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అంగర మాట్లాడుతూ తాను రాజ్యాంగ బద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడిన పెద్దల సభ సభ్యుడినని, తనకు గౌరవం ఇవ్వలేదన్నారు. వేదిక దిగి వెళుతుంటే మహిళ లందరూ తమవెంట రావడం పట్ల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.