బీసీ హక్కుల కోసం కృషి చేసిన నేత ఎర్రన్నాయుడు

ABN , First Publish Date - 2021-11-03T04:52:35+05:30 IST

బీసీల హక్కుల కోసం దివంగత నేత కింజారపు ఎర్రన్నాయుడు కృషి చేశారని పలువురు టీడీపీ నేతలు పేర్కొన్నారు.

బీసీ హక్కుల కోసం కృషి చేసిన నేత ఎర్రన్నాయుడు
ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న నేతలు

జంగారెడ్డిగూడెం, నవంబరు 2: బీసీల హక్కుల కోసం దివంగత నేత కింజారపు ఎర్రన్నాయుడు కృషి చేశారని పలువురు టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఎర్రన్నాయుడు వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ పట్టణ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఎర్రన్నాయుడు చిత్రపటానికి పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ, బీసీ నాయకులు రాజాన సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రావూరి కృష్ణ మాట్లాడుతూ కింజారపు ఎర్రన్నాయు డు సేవలను కొనియాడారు. డాక్టర్‌ రాజాన సత్యనారాయణ, ముస్తఫా, నంబూరి రామచంద్రరాజు, తూటికుంట దుర్గారావు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, చిట్రోజు తాతాజీ, తూటికుంట రాము, కోనేటి చంటి, పొదిల ఫణి, షేక్‌ యాకుబ్‌, పగడం దినేష్‌, గొల్లమందల శ్రీనివాస్‌, గంటా రామారావు, ఈర్ని సూరిబాబు, ఎండీ షాషీ, దుర్గేష్‌, రంగ తదితరులు పాల్గొన్నారు.


జంగారెడ్డిగూడెం పట్టణ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్య సాయి సేవా కార్యక్రమం ద్వారా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 150 మందికి అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం సభ్యులు, ఎర్రంనాయుడు అభిమానులు పాల్గొన్నారు.

దివంగత మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో ఆయన విగ్రహానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్‌ చంద్రశేషు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - 2021-11-03T04:52:35+05:30 IST