ఉద్యోగులను చిన్నచూపు చూస్తే ప్రభుత్వాలకు మనుగడ ఉండదు

ABN , First Publish Date - 2021-10-20T05:23:42+05:30 IST

ఉద్యోగులను చిన్నచూపు చూస్తే ప్రభుత్వాలకు మనుగడ ఉండదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్‌.విద్యాసాగర్‌ అన్నారు.

ఉద్యోగులను చిన్నచూపు చూస్తే ప్రభుత్వాలకు మనుగడ ఉండదు
సమావేశంలో మాట్లాడుతున్న ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌


ఆకివీడు, అక్టోబరు 19: ఉద్యోగులను చిన్నచూపు చూస్తే ప్రభుత్వాలకు మనుగడ ఉండదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్‌.విద్యాసాగర్‌ అన్నారు. ఉద్యోగ సంఘాల ఆకివీడు తాలూకా యూనిట్‌ సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను మరిచి కొందరు స్వార్థం కోసం ప్రభుత్వాలకు దాసోహం అంటున్నారని విమర్శిం చారు. సమాజానికి పునాది వంటి ఉద్యోగులను పాలకులు నమ్మించి మోసం చేస్తున్నారన్నారు. ఐఏఎస్‌ల మాయమాటలతో సీఎం నష్టపోతారని విద్యా సాగర్‌ అన్నారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేసి ఉన్నవారిని పర్మినెంట్‌ చేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ ఎత్తేస్తానన్న జగన్‌ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదన్నారు. 40 నెలలు దాటుతున్న నేటికి పీఆర్సీ విడుదల చేయలేదని, వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ప్రతీ నెల 15వ తేదీ దాటినా పింఛన్లు, జీతాలు అందుతాయా లేదోనని వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. పింఛన్లు, జీతాలు ఒకటో తేదీనే చెల్లించాలని ఆయన డిమాం డ్‌ చేశారు. ఉద్యోగులకు సంబంధించిన నిధులు ప్రభుత్వ పథకాలకు వాడడం తగదన్నారు. పనికి తగ్గ వేతనాలు చెల్లించాలన్నారు. 1993 ముందు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి డి.కృష్ణంరాజు, ఆకివీడు తాలూకా యూనిట్‌ అధ్యక్షుడు ఎం.సునీల్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2021-10-20T05:23:42+05:30 IST