ఆంధ్రా సుగర్స్ ఉద్యోగుల పాదయాత్ర
ABN , First Publish Date - 2021-12-26T06:46:11+05:30 IST
కరోనా నుంచి ప్రజలు కోలుకోవాలని, రా ష్ట్రం సుభిక్షంగా ఉండాలని తణు కు ఆంధ్రా సుగర్స్ ఉద్యోగులు ద్వారకాతిరుమలకు పాదయాత్ర చేపట్టారు.

తణుకు, డిసెంబరు 25: కరోనా నుంచి ప్రజలు కోలుకోవాలని, రా ష్ట్రం సుభిక్షంగా ఉండాలని తణు కు ఆంధ్రా సుగర్స్ ఉద్యోగులు ద్వారకాతిరుమలకు పాదయాత్ర చేపట్టారు. తణుకు హరిశ్చంద్ర ఎన్‌క్లేవ్ నుంచి ద్వారకాతిరుమలకు శనివారం మధ్యాహ్నం పాదయాత్రగా బయలు దేరారు. శనివారం రాత్రికి ద్వారకాతిరుమల చేరుకుంటామని, ఆదివారం శ్రీవారిని దర్శంచుకుంటామని వారు తెలిపారు.