మూడో రోజు ఉద్యోగుల నిరసన
ABN , First Publish Date - 2021-12-10T05:14:35+05:30 IST
డిమాండ్ల సాధ నకు ఉద్యోగులు చేపట్టిన నిరసన మూడో రోజు గురువారం కొనసాగింది.

నరసాపురం/పాలకొల్లు అర్బన్/భీమవరం,డిసెంబరు 9 : డిమాండ్ల సాధ నకు ఉద్యోగులు చేపట్టిన నిరసన మూడో రోజు గురువారం కొనసాగింది. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో కార్యా లయాల వద్ద కొద్ది సేపు నినాదాలు చేశారు.నరసాపురం తాలూక ఎన్జీవో అసోసి యేషన్ ఆధ్వర్యంలో మొగల్తూరు, తూర్పుతాళ్ళు, ఎల్‌బీచర్ల పీహెచ్‌సీలతో పాటు, వ్యవసాయ శాఖ, సబ్‌రిజిస్ర్టార్, ట్రెజరీ, నేవి సిబ్బంది ఆందోళన చేశారు. పాలకొల్లు లాకుల వద్ద ఉన్న ఇరిగేషన్ కార్యాలయ సిబ్బంది గురువారం నినా దాలు చేశారు. భీమవరంలో మున్సిపల్ ఉద్యోగులు నల్లబ్యాడ్జిలు ధరించి విధులకు హాజరయ్యారు.నిరవధిక కార్యాచరణలో భాగంగా నాలుగో రోజు శుక్రవా రం జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల ఉద్యోగులు, కార్మికులు నల్ల బ్యాడ్జీల తో విధులకు హాజరవుతారని, భోజన విరామంలో ధర్నా చేస్తారని ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ ఎస్.సర్వేశ్వరరావు,జనరల్ సెక్రటరీ ఎస్‌ఏ ఇబ్రహీం పాషా తెలిపారు.ఉద్యోగ సంఘాల నాయకులు ఆర్.కృష్ణకుమార్,రామసుబ్బారావు,గుడాల హరిబాబు, వేగేశ్న మురళీకృష్ణంరాజు,వీరవల్లి సాయి,లక్ష్మీనారాయణ, శ్రీనివాసన్ పాల్గొన్నారు.