‘ఓటీఎస్‌ పెద్ద కుట్ర.. నగదు చెల్లించొద్దు’

ABN , First Publish Date - 2021-12-15T05:34:36+05:30 IST

ఓటీఎస్‌ పెద్ద కుట్ర అని, ఎవరూ నగదు చెల్లించవద్దని, ఓటీఎస్‌ పేరుతో జగన్‌ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని ఏలూరు నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) విమర్శిం చారు.

‘ఓటీఎస్‌ పెద్ద కుట్ర.. నగదు చెల్లించొద్దు’
ఏలూరు బీడీ కాలనీలో మాట్లాడుతున్న టీడీపీ నేత బడేటి చంటి

ఏలూరురూరల్‌, డిసెంబరు 14 : ఓటీఎస్‌ పెద్ద కుట్ర అని, ఎవరూ నగదు చెల్లించవద్దని, ఓటీఎస్‌ పేరుతో జగన్‌ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని ఏలూరు నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) విమర్శిం చారు. తంగెళ్ళమూడి, బీడీ కాలనీ తదితర ప్రాంతాల్లో గౌరవ సభ పేరుతో మంగళవారం ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటీఎస్‌ పేరుతో ప్రభుత్వం సామాన్యులను భయబ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపించారు. గతంలో ముఖ్యమంత్రులు పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టిస్తే సీఎం జగన్‌ డబ్బులు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటీఎస్‌లో పది వేలు కట్టి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే ఇల్లు ఉందని పెన్షన్‌, రేషన్‌, ఇతర సంక్షేమ పథకాలు అన్నీ రద్దు చేస్తారని విమర్శించారు. టీడీపీ  అధికారంలోకి వచ్చిన తరువాత ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేటర్‌ తంగిరాల అరుణ, మాజీ ఎంపీటీసీ తంగిరాల సురేష్‌, పార్టీ నాయకులు రెడ్డి నాగరాజు, నెరుసు గంగరాజు, లంకపల్లి మాణిక్యాలరావు, దాకారపు రాజేశ్వరరావు, ఆర్‌ఎన్‌ఆర్‌ నాగేశ్వరరావు, బి.బాలాజీ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-15T05:34:36+05:30 IST