మాస్క్‌తోనే కరోనా నియంత్రణ

ABN , First Publish Date - 2021-01-20T05:46:40+05:30 IST

కరోనా నివారణకు మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం ద్వారానే నియంత్రణ సాధ్యమని మహిళా సంరక్షణ కార్యదర్శి పి.నాగేశ్వరి అన్నారు.

మాస్క్‌తోనే కరోనా నియంత్రణ
కొవ్వొత్తుల ర్యాలీలో సచివాలయ ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు

ఏలూరు రూరల్‌, జనవరి 19 : కరోనా నివారణకు మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం ద్వారానే నియంత్రణ సాధ్యమని మహిళా సంరక్షణ కార్యదర్శి పి.నాగేశ్వరి అన్నారు. రూరల్‌ మండలం శనివారపుపేట 3,4 సచివాలయాలు సిబ్బంది, ఆశా వర్కర్లు 50 రోజుల కరోనా, ఆరోగ్య, విద్యపై అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శ్రీరామ్‌నగర్‌ సచివాలయం నుంచి సెయింట్‌ ఆన్స్‌ కళాశాల వరకు ర్యాలీ కొనసాగింది. మాస్క్‌ ధరిద్దాం, కరోనా తరిమి కొడదాం అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమలో ఆరోగ్య కార్యదర్శి నాగమణి, కనకదుర్గ, ఆశావర్కర్లు, వలంటీర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-20T05:46:40+05:30 IST