వైభవంగా ఏనుగు సంబరం

ABN , First Publish Date - 2021-11-02T06:08:15+05:30 IST

వీరవాసరంలో సంప్రదాయంగా నిర్వహించే ఏనుగు (బేతాళ) సంబరం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది.

వైభవంగా ఏనుగు సంబరం
ఊరేగింపులో ఆకట్టుకున్న ప్రదర్శనలు

వీరవాసరం, నవంబరు1: వీరవాసరంలో సంప్రదాయంగా నిర్వహించే ఏనుగు (బేతాళ) సంబరం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. సాయంత్రం అయ్యేసరికి తగ్గుముఖం పట్టడంతో బేతాళ సంబరం ప్రారంభమైంది. అలంకరించిన ఏనుగు బొమ్మను ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలగ సంఘం యువజనుల జయబేతాళ నినాదాలతో సంబర ప్రాంగ ణం మారుమోగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకు న్నాయి. మధ్య వీధి, కూనపరెడ్డివారి వీధి, గ్రంధివారి వీఽధి, మార్కెట్‌ రహదారి మీదుగా ఎంఆర్‌కే జడ్పీహైస్కూల్‌ వరకూ ఉత్సవం కొనసాగింది. అక్కడి నుంచి జాతీయ రహదారిపై సంబరాన్ని ప్రారంభించారు. పాలకొల్లు సర్కిల్‌ పరిధిలోని పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. మోగల్లు వద్ద వంతెనపై నుంచి పడిన కారుబ్రిడ్జి పైనుంచి పడిన కారు..

పాలకోడేరు, నవంబరు 1 : మోగల్లు వద్ద బ్రిడ్జిపై నుంచి గోస్తని నది కాల్వ అంచున పడ్డ ప్రమాదంలో కారు నడుపుతున్న డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డాడు. కోరుకొల్లు గ్రామానికి చెందిన దాట్ల వంశీరాజు కారు వేసుకుని భీమవరం వైపు వస్తుండగా మోగల్లు వద్ద కారు అదుపు తప్పి బ్రిడ్జికి ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టి బ్రిడ్జిపై నుంచి కారు కాల్వ అంచున పడిపోయింది. కారు గట్టుమీద పడటంతో కారు నడుపుతున్న వంశీరాజు సురక్షితంగా బయట పడ్డాడు. అయితే అటుగా వెళుతున్న ప్రజలు మాత్రం ఆ యాక్సిడెంట్‌ చూసి వామ్మో ఎంత ప్రమాదం తప్పిందంటూ చూసి వెళుతున్నారు.  

Updated Date - 2021-11-02T06:08:15+05:30 IST