ఎన్నికల నిర్వహణలో అలసత్వం వద్దు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-02-02T04:56:47+05:30 IST

ఎన్నికల నిర్వహణలో అలసత్వం వద్దని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు అన్నారు.

ఎన్నికల నిర్వహణలో అలసత్వం వద్దు : కలెక్టర్‌

తణుకు, ఫిబ్రవరి 1 :ఎన్నికల నిర్వహణలో అలసత్వం వద్దని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు అన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు, నామినేషన్లు, పోటీలో నిలబడే అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ గురించి చర్యలు తీసుకున్నామన్నారు. కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. నామినేషన్లు తిరస్కరణకు గురికాకుండా ముందుగానే అధికారులకు చెక్‌లిస్ట్‌ ఇచ్చి పత్రాలను జత చేయాలన్నారు. తహసీల్దార్‌ ప్రసాద్‌, ఎంపీడీవో మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-02T04:56:47+05:30 IST