మాకు ఓటేయకుంటే..?

ABN , First Publish Date - 2021-02-05T06:37:20+05:30 IST

అధికార పార్టీ బలహీనంగా వున్నచోట సంక్షేమ ఫలాలను తెరపైకి తెస్తోంది. తాము నిల బెట్టిన అభ్యర్థికి ఓటు వేయకుంటే.. ఇళ్ల స్థలాలు నిలిపి వేస్తా మని హెచ్చరిస్తోంది.

మాకు ఓటేయకుంటే..?

అధికార పార్టీ బలహీనంగా వున్నచోట సంక్షేమ ఫలాలను తెరపైకి తెస్తోంది. తాము నిల బెట్టిన అభ్యర్థికి ఓటు వేయకుంటే.. ఇళ్ల స్థలాలు నిలిపి వేస్తా మని హెచ్చరిస్తోంది.  కొందరు నాయకులు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు తమ సొం తవి అన్నట్టు భావిస్తున్నారు. తామే ఇస్తున్నట్టు గ్రామాల్లో హడావుడి చేస్తున్నారు. తమ పార్టీ పథకా లుగా ప్రచారం చేస్తూ.. ప్రజలను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. పెంటపాడు మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో జరిగిన ఈ ఉదంతమే దీనికి కారణం. అక్కడ అధికార పార్టీ కార్యకర్తలు తమ అభ్యర్థికి ఓట్లు అభ్యర్థిస్తూ ప్రచారం చేస్తున్నారు. పనిలో పనిగా తమకు ఓట్లు వేయకుంటే లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు నిలిపి వేస్తామంటూ భయపెట్టే చర్యలకు దిగారు. విషయం తెలిసిన ప్రతిపక్షాలు ఎదురు తిరిగాయి. పథకాలు ప్రభుత్వానివి, పార్టీవి కావంటూ గట్టిగా సమాధానం ఇవ్వడంతో అధికార పార్టీ కార్యకర్తలు వెనక్కి తగ్గారు.  

– తాడేపల్లిగూడెం

Updated Date - 2021-02-05T06:37:20+05:30 IST