ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే
ABN , First Publish Date - 2021-11-06T05:02:13+05:30 IST
ఎన్నికల నిబంధనలు అధికారులు కఠినంగా పాటించాలని నరసాపురం సబ్ కలెక్టర్ విష్ణుచరణ్ అన్నారు.

సబ్ కలెక్టర్ విష్ణుచరణ్
ఆకివీడు, నవంబరు 5 : ఎన్నికల నిబంధనలు అధికారులు కఠినంగా పాటించాలని నరసాపురం సబ్ కలెక్టర్ విష్ణుచరణ్ అన్నారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నామినేషన్ల పత్రాలను పరిశీలించి మాట్లాడారు. నామినేషన్ల దగ్గర నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎన్నికల అబ్జర్వర్ రాహుల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధికారులంతా బాధ్యతగా పనిచేయాలన్నారు. అనంతరం జడ్పీ బాలురు ఉన్నత పాఠశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ పెద్దిరెడ్డి సత్యవేణి, ఎస్‌ఐ బీవై.కిరణ్‌కుమార్,తహసీల్దార్ ఎన్.గురుమూర్తి రెడ్డి పాల్గొన్నారు.