మోగిన ఎన్నికల సైరన్‌

ABN , First Publish Date - 2021-11-02T06:10:17+05:30 IST

ఆకివీడు నగర పంచాయతీ పోరుకు భేరీ మోగింది. ఎన్నికల కమిషన్‌ సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 3 ఉదయం 11 నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటలు వరకు నామినేషన్లు స్వీకరణ, 6వ తేదీ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు పరిశీలన, 8న మధ్యాహ్నం 3 గంటలలోపు ఉపసంహరణ ఉంటాయి.

మోగిన ఎన్నికల సైరన్‌
ఆకివీడు టౌన్‌ వ్యూ

ఆకివీడు నగర పంచాయతీ పోరుకు షెడ్యూల్‌ 

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

15న పోలింగ్‌...17న కౌంటింగ్‌

ఆకివీడు,  నవంబరు 1 : ఆకివీడు నగర పంచాయతీ పోరుకు భేరీ మోగింది. ఎన్నికల కమిషన్‌ సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 3 ఉదయం 11 నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటలు వరకు నామినేషన్లు స్వీకరణ, 6వ తేదీ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు పరిశీలన, 8న మధ్యాహ్నం 3 గంటలలోపు ఉపసంహరణ ఉంటాయి. మూడు గంటల తరువాత అభ్యర్థుల వివరాలు తెలియపరుస్తారు. 15న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎంపిక చేసిన బూత్‌లలో పోలింగ్‌ జరుగుతుంది. 17న ఉదయం 8 గంటల నుంచి జిల్లా పరిషత్‌ బాలురున్నత పాఠశాలలో లెక్కింపు జరుగుతుంది. నగర పంచాయతీ పరిధిలో ఇప్పటికే పొరపాట్లకు తావులేకుండా ఓటర్ల జాబితా రూపొందించినట్టు అధికారులు తెలుపుతున్నారు.పట్టణ పరిధిలో 20 వార్డులకు మొత్తం 25,792 మంది ఓటర్లు ఉన్నారు.


ఎన్నికల అధికారులు వీరే

1 నుంచి 4 వార్డులకు వ్యవసాయశాఖ ఏడీ ఈదా అనిల్‌కుమారి, 5 నుంచి 8 వార్డులకు డిప్యూటీ తహసీల్దార్‌ ఎం.సునీల్‌కుమార్‌, 9 నుంచి 12 వార్డులకు ఎంఈవో ఎ.రవీంద్ర, 13 నుంచి 16 వార్డులకు వ్యవసాయాధికారి ఎంఆర్పీ ప్రియాంక, 17 నుంచి 20 వార్డులకు ఇరిగేషన్‌ ఏఈ ఎంవీవీ పెద్దిరాజుతో పాటు అదనంగా భీమవరం మున్సిపాల్టీ డీఈఈ కె.రాజారావు, ఆకివీడు డ్రెయి నేజీ ఏఈ ఎం.ఖాదర్‌లను నియమించారు. ఇరవై వార్డులకు 39 పోలింగ్‌ బూత్‌లుండగా వాటిలో 29 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.


ఓటర్ల జాబితా గందరగోళం

పెంకి అప్పారావు, సీఐటీయూ మండల అధ్యక్షుడు, ఆకివీడు

అధికారులు ప్రకటించిన ఓటర్ల జాబితా గందరగోళంగా ఉంది. ఒక్కో వార్డులో ఓటర్లు నాలుగైదు చోట్లకు వెళ్లి ఓట్లు వేసేలా జాబితా ఉంది. దూరం వెళ్లి ఓటు వేయాలంటే వృద్ధులు,దివ్యాంగులు ఇబ్బందులు పడతారు.జాబితాలో చనిపోయినవారి పేర్లు, ఇతర ఊర్లుకు వెళ్ళిపోయిన వారిపేర్లు కూడా ఉన్నాయి.సంబంధిత అధికారులను అడిగితే మార్చడానికి వీలులేదన్నారు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైందున కోడ్‌ కఠినంగా అమలుచేయాలి. వలంటీర్ల జోక్యం తగదు. 

Updated Date - 2021-11-02T06:10:17+05:30 IST