ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగవద్దు

ABN , First Publish Date - 2021-02-06T05:01:23+05:30 IST

పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేందుకు గ్రామ మహిళా సమాఖ్య కార్యుదర్శులు కృషి చేయాలని నరసాపురం డీఎప్పీ వీరాంజనేయరెడ్డి అన్నారు.

ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగవద్దు
సమావేశంలో మాట్లాడుతున్న నరసాపురం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి

భీమవరం క్రైం, ఫిబ్రవరి 5 : పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేందుకు గ్రామ మహిళా సమాఖ్య కార్యుదర్శులు కృషి చేయాలని నరసాపురం డీఎప్పీ వీరాంజనేయరెడ్డి అన్నారు. భీమవరం పట్టణ రూరల్‌, గ్రామ మహిళ సమాఖ్య కార్యదర్శులకు పంచాయితీ ఎన్నికలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ వీరాంజనేయరెడ్డి మాట్లాడుతూ నరసాపురం సబ్‌ డివిజన్‌ పరిధిలో పాలకొల్లు, నరసాపురం, భీమవరం, 12 మండలాల్లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా మహిళా సంరక్షకులను భాగస్వామి చేస్తున్నామని, వారందరికీ ఎన్నికల కొత్త కాబట్టి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల సందర్భంగా ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పార్టీల కతీతంగా గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరు ఎన్నికల కోడ్‌ పాటిస్తూ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలన్నారు. కార్యక్రమంలో వన్‌టౌన్‌ సీఐ కృష్ణభగవాన్‌, టూటౌన్‌ సీఐ విజయ్‌కుమార్‌, వన్‌టౌన్‌ ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, భీమవరం రూరల్‌, పాలకోడేరు, కాళ్ళ, ఆకివీడు, ఉండి ఎస్‌ఐలు సుధాకర్‌రెడ్డి, ప్రసాద్‌, వర్మ, వీరభద్రరావు, అప్పలరాజు, గ్రామ మహిళా సమాఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T05:01:23+05:30 IST