ఈకేవైసీ కష్టాలు

ABN , First Publish Date - 2021-08-28T05:23:45+05:30 IST

ఈకేవైసీ చేయించకపోతే రేషన్‌ నిలిచిపోతుందనే ప్రచారంతో ప్రజానీకం ఆధార్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.

ఈకేవైసీ కష్టాలు
పోలవరం పోస్టాఫీస్‌ వద్ద బారులు తీరిన జనం

పోలవరం, ఆగస్టు 27: ఈకేవైసీ చేయించకపోతే రేషన్‌ నిలిచిపోతుందనే ప్రచారంతో ప్రజానీకం ఆధార్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోల వరం పోస్టాఫీస్‌ వద్ద ఒక్క కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉండడంతో రోజుకు 30మందికి మాత్రమే సేవలందించగలుగుతున్నారు. మండలంలో 4175 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. సీఎస్‌ డీటీ దుర్గా మహలక్ష్మిని వివరణ కోరగా ఆధార్‌, ఈకేవైసీ వలంటీర్ల ద్వారా నిర్వహిస్తామని ప్రక టించినా ఆచరణలోకి రాలేదన్నారు. పోస్టాఫీస్‌లో ఈకేవైసీ చేస్తారన్నారు.

Updated Date - 2021-08-28T05:23:45+05:30 IST