కార్డుదారులు ఈకేవైసీ చేయించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-08-11T05:19:00+05:30 IST

జిల్లాలోని బియ్యం కార్డుదారులందరూ ఈకేవైసీ విధిగా చేయించుకోవాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు.

కార్డుదారులు ఈకేవైసీ చేయించాలి : కలెక్టర్‌

ఏలూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని బియ్యం కార్డుదారులందరూ ఈకేవైసీ విధిగా చేయించుకోవాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. బియ్యం కార్డులో ఉన్న ప్రతివ్యక్తి ఆధార్‌ ఈకేవైసీ నమోదు చేయించు కోవడం తప్పనిసరి అన్నారు.అలా చేయించుకోకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఈకేవైసీ నమోదు చేయించుకోవాల్సిన వారికి నోటీసులు అందిస్తారని, నోటీసులు అందుకున్నవారు ఈ నెల 11వ తేదీ నుంచి ఈకేవైసీ నమోదు చేసుకో వచ్చని కలెక్టర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-11T05:19:00+05:30 IST