కొవిడ్ వ్యాక్సిన్ వినియోగించుకోండి
ABN , First Publish Date - 2021-03-08T05:01:48+05:30 IST
కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్క రూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు.
ఎమ్మెల్యే మంతెన రామరాజు
కాళ్ళ, మార్చి 7 : కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్క రూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆకివీడు సీహెచ్సీ, పెదకాపవరం, ఉండి, యండగండి, కాళ్ళ, పాలకోడేరు పీహెచ్సీలలో వ్యాక్సిన్ అందు బాటులో ఉందన్నారు. 45 – 59 ఏళ్ల వయస్సు వారు వ్యాక్సిన్ పొందవచ్చ న్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు సంబంధిత డాక్టర్ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే ప్రభుత్వ వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. అందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకుని కరోనా లేని నియోజకవర్గంగా ఉండేటట్లు సహకరించాలని ఆయన కోరారు.