చిన వెంకన్న హుండీ ఆదాయం రూ. 2 కోట్లు

ABN , First Publish Date - 2021-01-21T04:58:16+05:30 IST

ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి గడచిన 23 రోజులకు హుండీల ద్వారా రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చినట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ తెలి పారు.

చిన వెంకన్న హుండీ ఆదాయం రూ. 2 కోట్లు
హుండీల ద్వారా వచ్చిన నగదు లెక్కిస్తున్న సిబ్బంది

ద్వారకా తిరుమల, జనవరి 20: ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి గడచిన 23 రోజులకు హుండీల ద్వారా రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చినట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ తెలి పారు. .2 కోట్ల 21 లక్షల 20 వేల 41 రూపాయలు నగదు రాగా, బంగారం 671 గ్రాములు, వెండి 10 కిలోల 663 గ్రాములు వచ్చినట్టు తెలిపారు. చెల్లని పాత వెయ్యి నోట్లు 1, రూ.500 నోట్లు 20, పలు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్టు తెలిపారు. 


Updated Date - 2021-01-21T04:58:16+05:30 IST