డస్ట్‌బిన్‌లు పంపిణీ చేస్తున్న శ్రీనివాస రవీంద్ర, తదితరులు

ABN , First Publish Date - 2021-10-07T06:01:06+05:30 IST

కొవ్వూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలని కొవ్వూరు మునిసిపల్‌ 15వ వార్డు కౌన్సిలర్‌ అక్షయపాత్ర శ్రీనివాస రవీంద్ర అన్నారు.

డస్ట్‌బిన్‌లు పంపిణీ చేస్తున్న శ్రీనివాస రవీంద్ర, తదితరులు
డస్ట్‌బిన్‌లు పంపిణీ చేస్తున్న శ్రీనివాస రవీంద్ర, తదితరులు

కొవ్వూరు, అక్టోబరు 6 : కొవ్వూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలని కొవ్వూరు మునిసిపల్‌ 15వ వార్డు కౌన్సిలర్‌ అక్షయపాత్ర శ్రీనివాస రవీంద్ర అన్నారు. బుధవారం కొవ్వూరు పట్టణంలోని 13, 15, 17వ వార్డులలో నూతన పారిశుధ్య విధానం క్లాప్‌ క్లీన్‌ ఏపీ కార్యక్రమంపై వార్డులలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. కొవ్వూరు రైల్వేస్టేషన్‌ సమీపంలోని టెలిఫోన్‌ ఎక్ష్సేంజ్‌ వద్ద వార్డు ప్రజలకు మూడు రకాల డస్ట్‌బిన్‌లను పంపిణీ చేశారు. ప్రజలంతా రోజు వారీ చెత్తను తడి, పొడి చెత్త, హానికరమైన చెత్త వేరుచేసి డస్ట్‌బిన్‌లలో వేసి మునిసిపల్‌ సిబ్బందికి అందించాలన్నారు. మునిసిపల్‌ కౌన్సిలర్లు సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్‌, రుత్తల ఉదయ భాస్కరరావు, సుర్ల నగేష్‌, నాళం నాగేశ్వరరావు, ఆర్వీ సుబ్రహ్మణ్యం, సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లు  పాల్గొన్నారు.

Updated Date - 2021-10-07T06:01:06+05:30 IST