ఫేస్‌బుక్ పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-10-30T05:01:59+05:30 IST
సోషల్ మీడియా, ఫేస్‌బుక్‌లలో పరిచయమయ్యే అపరిచిత వ్యక్తుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సీ, ఎస్టీ సెల్–2 డీఎస్పీ ఎస్.బీ.బీ. సుభాకర్ అన్నారు.

పెంటపాడు, అక్టోబరు 29: సోషల్ మీడియా, ఫేస్‌బుక్‌లలో పరిచయమయ్యే అపరిచిత వ్యక్తుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సీ, ఎస్టీ సెల్–2 డీఎస్పీ ఎస్.బీ.బీ. సుభాకర్ అన్నారు. అపరిచిత వ్యక్తులు చెప్పే మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. శుక్రవారం ఎస్సీ , ఎస్టీ సెల్ కేసు దర్యాప్తు నిమిత్తం పెంటపాడు విచ్చేసిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. పడమరవిప్పర్రు గ్రామానికి చెందిన ఒక మహిళకు సంవత్సరం క్రితం ఫేస్‌బుక్‌లో తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం ముక్కామల గ్రామానికి చెందిన జగదీష్ అనే వ్యక్తితో పరిచమయ్యింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. అయితే మహిళను జగదీష్ వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో గురువారం మహిళ పెంటపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ. చంద్రశేఖర్ కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ సుభాకర్ తెలిపారు. డీఎస్పీ వెంట తాడేపల్లిగూడెం రూరల్ సీ.ఐ రవికుమార్, పెంటపాడు ఎస్.ఐ చంద్రశేఖర్ ఉన్నారు.