చిన వెంకన్నకు రూ.15.49 లక్షల విరాళం
ABN , First Publish Date - 2021-08-26T05:16:45+05:30 IST
వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి హైదరాబాద్‌కు చెందిన కందాడై శ్రీనివాసాచారి, శ్రీదేవి దంపతులు 15,49,231 రూపాయల విరాళం అందజేశారు.

ద్వారకాతిరుమల, ఆగస్టు 25: వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి హైదరాబాద్‌కు చెందిన కందాడై శ్రీనివాసాచారి, శ్రీదేవి దంపతులు 15,49,231 రూపాయల విరాళం అందజేశారు. అన్నదాన పథకానికి రూ.4,85,116, గో సంరక్షణకు రూ. 2,00,232, స్వామివారి, అమ్మవార్ల బంగారు ఆభరణాల నిమిత్తం 183 గ్రాముల బంగారం (రూ.8,27,735), కల్యాణం, పూజల నిమిత్తం రూ.14,428, స్వామి, అమ్మవారి పట్టువస్త్రాలకు రూ.21,720 విరాళంగా అందజేసినట్లు ఈవో సుబ్బారెడ్డి తెలిపారు. దాతలకు స్వామివారి దర్శనం కల్పించి ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఏఈవో దుర్గారావు, సిబ్బంది పాల్గొన్నారు.