జ్వరం వస్తే.. నిర్లక్ష్యం వద్దు

ABN , First Publish Date - 2021-05-05T05:53:48+05:30 IST

వరుసగా 3 రోజులు 103 జ్వరం ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు..

జ్వరం వస్తే.. నిర్లక్ష్యం వద్దు
డాక్టర్‌ అడ్డాల ప్రతాప్‌ కుమార్‌

డాక్టర్‌ అడ్డాల ప్రతాప్‌ కుమార్‌, నోడల్‌ అధికారి, పాలకొల్లు

పాలకొల్లు రూరల్‌, మే 4 : వరుసగా 3 రోజులు 103 జ్వరం ఉంటే  నిర్లక్ష్యం చేయవద్దు.. సాధారణ జ్వరంగా కొట్టిపారేయ వద్దు..వెంటనే ఆసుపత్రిలో జాయిన్‌ కావాలి.. పరీక్షలు చేయిం చుకుని పాజిటివ్‌గా తేలితే వెంటనే చికిత్స ప్రారంభించాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉం టుంది.  హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నవారు చాలా జాగ్తత్తగా ఉం డాలి. ఆక్సీమీటర్‌ దగ్గర ఉంచుకోవడం మంచిది. ప్రతీ 2,3 గంటల కొకసారి ఆక్సిజన్‌ లెవెల్స్‌ పరీక్షించుకుంటూ ఉండాలి. ఆక్సిజన్‌ లెవెల్స్‌ 91,92 ఉంటే వెంటనే ఆసుపత్రిలో జాయిన్‌ కావాలి. జలుబు ఉంటే రోజులో 2, 3 సార్లు ఆవిరి పట్టాలి. ఆస్మా ఉన్న వారు ఆవిరి పట్టకపోవడం మంచిది. ప్రతీ రోజూ ప్రొటీన్లు ఉన్న ఆహారం కోడి మాంసం, ఉడకబెట్టిన కోడి గుడ్డు, డ్రైఫ్రూట్స్‌ తీసుకోవాలి. దీంతో ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది. ఒకే ఇంటిలో ఇద్దరు కరోనా బాధితులు ఉంటే వారు తప్పనిసరిగా వేర్వేరు గదుల్లో ఉండాలి. ఒకరు వాడిన వస్తువులు మరొకరు వాడరాదు. హోం క్వారంటైన్‌లో 14 రోజులు ఉన్న తరువాత కరోనా పరీక్షలు చేయించుకుని ఆరోగ్యంగా బయట పడవచ్చు. ఇతర  ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సూచనల మేరకు మరో వారం రోజులు ఇంటిలోనే ఉండాలి. బయట తిరగరాదు.                


Updated Date - 2021-05-05T05:53:48+05:30 IST