సిబ్బందికి డాక్టర్ వేధింపులు
ABN , First Publish Date - 2021-09-04T05:00:10+05:30 IST
చీరలతో విధులకు రండి.. ఎదురుగా కూర్చోండి..లేదంటే మీ సంగతి చూస్తా.. ఇదీ సిబ్బందికి ఒక డాక్టర్ బెదిరింపు..

దుర్గాపురం పీహెచ్‌సీ డాక్టర్ నిర్వాకం
సిబ్బంది ఆందోళన
భీమవరం క్రైమ్, సెప్టెంబరు 3 : చీరలతో విధులకు రండి.. ఎదురుగా కూర్చోండి..లేదంటే మీ సంగతి చూస్తా.. ఇదీ సిబ్బందికి ఒక డాక్టర్ బెదిరింపు..భీమవరం దుర్గాపురం పీహెచ్‌సీలో కొంత కాలంగా డాక్టర్ కె.బాలరాజు పనిచేస్తున్నాడు. శారీరకంగా, మానసికంగా హింసించడమే కాకుం డా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని హెల్త్ సెక్రటరీలు, సిబ్బంది వాపోతున్నారు.వేధింపులు భరించలేకపోతున్నామంటూ శుక్రవారం ఆందోళనకు దిగారు.ఈ మేరకు సమాచారం అందడంతో డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రసాద్ ఆసుపత్రికి చేరుకుని డాక్టర్ బాలరాజును నిలదీశారు. ఒక్కసారిగా వైద్యుడు తన గదిలోకి వెళ్లి స్పృహ తప్పి పడిపోయాడు. అప్పటికే అక్కడ ఉన్న టూటౌన్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో మాట్లాడుతూ వేధింపులపై దర్యాప్తు చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతామన్నారు.సిబ్బంది ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ అప్పారావు తెలిపారు.
