డీజిల్‌ దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2021-05-02T05:51:27+05:30 IST

పట్టణ పరిధిలో పలు చోట్ల ఆయిల్‌ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐలు కె. రామారావు, డి.రవికుమార్‌ చెప్పారు.

డీజిల్‌ దొంగ అరెస్టు

తణుకు, మే 1: పట్టణ పరిధిలో పలు చోట్ల ఆయిల్‌ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐలు కె. రామారావు, డి.రవికుమార్‌ చెప్పారు. ఏలూరు తూర్పు వీదికి చెందిన రామెళ్ళ రామకృష్ణ, జాతీయ రహదారిపై ట్యాంకుల నుంచి డీజిల్‌ దొంగతనాలకు పాల్పడుతున్నాడని, శనివారం బైపాసు రోడ్డులో చర్చి వద్ద రామకృష్ణను అరెస్టు చేసి అతని  నుంచి టాటా సఫారి కారు, 17 ఖాళీ ఆయిల్‌ డబ్బాలు, ఆయిల్‌ తీసే పైపులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే  నిందితుడికి సహకరించిన విజయవాడకు చెందిన రాజేష్‌, ఏలూరుకు చెందిన రవితేజతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. దర్యాప్తునకు సహకరించిన ఎస్‌ఐ పోలయ్య, శ్రీధర్‌, హెచ్‌సీ సత్యనారాయణ, పీసీలు శ్రీనివాసు, రవీంద్రలను డీఎస్పీ బి.శ్రీనాథ్‌,  సీఐ చైతన్యకృష్ణ  అభినందించి రివార్డు కోసం  ఎస్పీకి సిఫార్సు చేశామన్నారు.


Updated Date - 2021-05-02T05:51:27+05:30 IST