అనుమానాస్పదంగా యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-11-06T05:03:26+05:30 IST

అనుమానాస్పదంగా ఓ యువకుడు ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన దెందులూరు మండలం జోగన్నపాలెంలో శుక్రవారం జరిగింది.

అనుమానాస్పదంగా యువకుడి మృతి

దెందులూరు, నవంబరు 5: అనుమానాస్పదంగా ఓ యువకుడు ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన దెందులూరు మండలం జోగన్నపాలెంలో శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ వీర్రాజు తెలిపిన వివరాలివి.. గ్రామంలో దళితవాడకు చెందిన గేర శివన్నారాయణ, రంగమ్మ కుమారుడు రమేష్‌ (26) కొవ్వలిలోని ఓ రైస్‌ మిల్లులో పని చేస్తున్నాడు. ప్రతి రోజు మాదిరిగా గురువారం పనికి వెళ్లొచ్చి ఇంట్లో పడుకుని రాత్రి పది గంటల సమయంలో బయటకు వెళ్లాడు. ఉదయం లేచి చూసేసరికి తమ ఇంటి స్థలంలోని చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. యువకుడి ఒంటి మీద గాయాలు ఉండడం గమనించిన తల్లిదండ్రులు దెందులూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుప త్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-11-06T05:03:26+05:30 IST